ACB : ఏసీబీకి వలలో ముగ్గురు అధికారులు

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఒకే రోజు ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ట్రాన్స్‌కో ఎఇ శరత్ కుమార్ రైతుకు ట్రాన్స్‌ఫార్మ ర్ మంజూరు చేసేందుకు రూ.లక్ష లంచం అడిగాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటుం డగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. అలాగే, మొదక్ జిల్లా నర్సాపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ ఎసిబి వలలో చిక్కాడు. ఆగరో ఏజెన్సీ దుకాణం కోసం అనుమతికి రూ.30 వేలు లంచం తీసుకుంటుండా ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లా చింతపల్లిలో విద్యుత్ శాఖ ఉద్యోగి వేణు బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. తొలి విడతగా బాధి తుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న క్రమంలో ఎసిబి అధికారులు వలపన్ని అతడిని పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com