TS : రేవంత్ పరిశీలనలో మూడు చిహ్నాలు

TS : రేవంత్ పరిశీలనలో మూడు చిహ్నాలు
X

తెలంగాణ ప్రభుత్వం కొత్త చిహ్నం దాదాపుగా సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వచ్చిన మూడు నమూనాల్లో ఒకదానిని కన్ఫామ్‌ చేసినట్లు తెలుస్తోంది. మూడు నమూనాల్లో ఒకదానిలో చార్మినార్, పూర్ణకుంభం, అశోక చక్రం, చుట్టూ వరికంకులు ఉన్నాయి.

మరోదాంట్లో తెలంగాణ మ్యాప్‌ బుద్దుడు, వరి కంకులు ఉన్నాయి. ఈమూడు నమూనాల్లో కాకతీయ కళాతోరణం మాత్రం కనిపించలేదు.

ఐతే.. చార్మినార్ మాత్రం కనిపించింది. రాచరిక పోకడలు తన ప్రభుత్వంలో ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఏ చిహ్నానికి ఆమోదం తెలుపుతారన్నది ఆసక్తిగా మారింది.

Tags

Next Story