TS : నేడు దానం నాగేందర్ నామినేషన్

సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్. సి. రోహిణ్‌రెడ్డి తెలిపారు. బర్కత్‌పురలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా ప్యాట్నీ సెంటర్ మహబూబియా కళాశాల వరకు వెళ్తారని తెలిపారు. అక్కడ కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు. అక్కడి నుంచి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని తెలిపారు.
ఈరోజు సాయంత్రం వరంగల్ లో జరిగే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ విపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. పదేళ్లలో ఇటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్.. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలు ప్రజలను దోచుకున్నాయని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com