TG : మా ఆఫీస్‌లో ఇటుక కదిలినా.. గాంధీభవన్ కూల్చేస్తాం... బీఆర్ఎస్ నేత వార్నింగ్

TG : మా ఆఫీస్‌లో ఇటుక కదిలినా.. గాంధీభవన్ కూల్చేస్తాం... బీఆర్ఎస్ నేత వార్నింగ్
X

తెలంగాణలో కూడా బుల్డోజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. గాంధీ భవన్ కూడా కూలుతది అని కాంగ్రెస్ సర్కార్‌కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఇటుక ఒక్కటి కదిపినా.. అక్కడ గాంధీ భవన్‌ను కూడా కూలుతది.. చట్టం ఎవరికైనా సమానమే అని ఆయన స్పష్టం చేశారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి .. అన్ని బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చే కుట్ర చేస్తున్నారు ఆరోపించారు.

హనుమకొండ జిల్లా కార్యాలయాన్ని టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చారనీ.. గుర్తింపు పొందిన పార్టీలకు స్థలాలను కేటాయించే జీవోను కేసీఆర్ తీసుకురాలేదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా గాంధీ ట్రస్టు ఏ స్ఫూర్తితో ఏర్పడ్డదో ఆత్మవిమర్శ చేసుకోండి. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏది వర్తిస్తే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు కూడా అదే వర్తిస్తది అనీ.. ఇక్కడ ఒక్క ఇటుక పెల్ల కదిపిన అక్కడ గాంధీ భవన్ కూలుతుద అని పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. 2008లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మెయిన్ రోడ్డులో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు ఏ విధంగా ల్యాండ్ కేటాయించబడిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

Tags

Next Story