TS : కాకతీయ తోరణాన్ని టచ్చేస్తే అగ్నిగుండమే.. హరీశ్ రావు వార్నింగ్

రాజముద్రలో కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వార్నింగ్ ఇచ్చారు. ఉద్దెర మాటలు తప్ప కాంగ్రెస్ ఉద్దరించేది లేదన్నారు. హనుమకొండ జిల్లా చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో జరిగిన వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో హరీశ్ మాట్లాడారు. .
'సీఎం రేవంత్ (CM Revanth Reddy) తెలంగాణ చిహ్నంలోని కాకతీయ తోరణం తీసేస్తా అంటున్నడు. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండం ఐతది. కాకతీయ తోరణం ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. దాన్ని తొలగిస్తే హస్తం పార్టీ నామరూపాల్లేకుండా పోతది. కాంగ్రెస్ పాలనలో లీకు, ఫేక్ వార్తలే తప్ప ఏమీ లేదు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తమన్నారు. ఏం చేశారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
రేవంత్ వి అన్నీ తుపాకీ రాముని ముచ్చట్లేనని అన్నారు హరీశ్ రావు. కడియం వెళ్లిన తర్వాత పార్టీ లో జోష్ కనిపిస్తోంది. పార్టీకి ద్రోహం చేసిన ఆయన్ను ఓడగొట్టాలని కసి కనపడుతోంది. ఇంత దిగజారడం అవసరమా అని శ్రీహరి ఆలో చించాలి. నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి' అని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com