TG : సీఎం రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బే..!

TG : సీఎం రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బే..!

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచాయి. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి హస్తం పార్టీకి సవాల్ విసిరింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. 2019లో రేవంత్ ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరిలో బీజేపీ పాగా వేసింది. తెలంగాణ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే హైకమాండ్ దగ్గర రేవంత్ పలుకుబడి పెరిగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. జూన్ 2న విడుదలైన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు.

Tags

Next Story