TS : హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షో.. ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనన్నారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్తాపూర్ లోని PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్‌లు 121 నుండి 152 మధ్య రోడ్‌షో జరగనుంది. సాయంత్రం హైదరాబాద్‌లోని మెహదీపట్నం నుండి ఆరాంఘర్ రోడ్ వైపు కాకుండా మరోదారి చూసుకోవాలని పోలీసులు వాహనదారులను, ప్రజలను కోరుతూ ట్రాఫిక్ సలహా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి రోడ్ షో కోసం రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్ షోతో.. అటు ఓల్డ్ సిటీ.. ఇటు చేవెళ్ల సెగ్మెంట్లలో జోష్ నింపాలని కాంగ్రెస్ డిసైడైంది. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అన్నారు.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో పార్టీ అభ్యర్థి డి.నాగేందర్ ప్రచారంలో భాగంగా జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com