TG : విషాదం.. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. తల్లి పద్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో తండ్రికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ(26), ఇద్దరు కుమార్తెలు వసంత(6), తేజస్విని(3), కుమారుడు రిత్విక్(10 నెలలు)గా గుర్తించారు. తండ్రికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇకపోతే భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఇంట్లో తిని నిద్రపోయారు. అయితే ఆదివారం కురిసిన వర్షానికి అర్థరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు అక్కడికి అక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలను సేకరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com