TS : హైబీపీతో కుప్పకూలి .. హెడ్ కానిస్టేబుల్ మృతి

క్రికెట్ బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తూ హైబీపీతో కుప్పకూలి చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగనపల్లికి చెందిన మేకల శ్యాంసుందర్ (Mekala ShyamSundar) (42) 2003లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం హెడ్ కానిస్టే బుల్ గా పదోన్నతి పొంది మాడ్గుల పీఎస్ఎస్. బి (స్పెషల్ బ్రాంచ్)లో విధులు నిర్వహిస్తున్నాడు.
గత నెల 27న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో హైబీపీతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్న శ్యాంసుందర్ సోమవారం బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తేల్చారు.
శ్యాంసుందర్ కు భార్య లిఖితతో పాటు 11, 8 ఏళ్ల ఇద్దరు కూతుర్లు, 6 ఏళ్ల కొడుకు ఉన్నాడు. శ్యాంసుందర్ అవయవాలను దానం చేసి కుటుంబ సభ్యులు పెద్ద మనుసు చాటుకున్నారు. శ్యాం సుందర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com