TGSRTC : టీఎస్ఆర్టీసీ ఇక టీజీఎస్ఆర్టీసీ.. ఇది గమనించారా..!

TGSRTC : టీఎస్ఆర్టీసీ ఇక టీజీఎస్ఆర్టీసీ.. ఇది గమనించారా..!
X

తెలంగాణ ఆర్టీసీ పేరు మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్పు చేస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు టీఎస్ ఆర్టీసీగా ఉన్న లోగో.. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీగా మారింది.

టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్ కు బదులు టీజీఎస్ అని రాయనున్నారు. కేంద్రం అనుమతి ఇస్తూ గెజిట్ కూడా జారీచేసింది.

మొదటగా మార్చిలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్ తొలగించి టీజీగా మార్చింది. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మార్పులు చేయగా.. తాజాగా ఆర్టీసీ సైతం టీజీఎస్ ఆర్టీసీగా మార్పులు చేసింది.

Tags

Next Story