TS : టెన్త్ ఎగ్జామ్స్ ... విద్యార్థులకు సజ్జనార్ ఆల్ ది బెస్ట్ ..

టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ (All The Best) చెప్పారు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్ (Sajjanar). విద్యార్థుల ట్రాన్స్ పోర్ట్ కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. విద్యాశాఖ సూచనలతో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఇన్ టైమ్ లో చేరుకునేలా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు సజ్జనార్. విద్యార్థులు తమ హాల్ టికెట్స్ చూపించి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా జర్నీ చేయవచ్చన్నారు .
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. విద్యార్థులకు రవాణా విషయంలో అసౌకర్యం కలగకుండా TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం (18.03.2024) నుంచి 02.04.2024 వరకు బస్సులు తిరుగుతాయి.
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా.. విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉంది. కావున క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని TSRTC యాజమాన్యం విద్యార్థులను కోరుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com