TS : కరీంనగర్‌లో ట్విస్ట్.. నేరేళ్ల బాధితుల సంచలన నిర్ణయం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయంగా ప్రభావితం చేయదగ్గ కీలక పరిణామం చోటుచేసుకుంది. కరీంనగర్‌లో ప్రధాన రాజకీయ పార్టీలకు భారీ షాక్ తగలనుంది. లోక్ సభ ఎన్నికలకు కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నేరేళ్ల బాధితుల పక్షాన వారి మద్దతుతో బాధితుడు కోల హరీష్ బరిలో ఉంటున్నట్లు తెలిపారు. తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వాలు మారిన న్యాయం జరగడం లేదని, పార్లమెంటు వేదికగా తమ గొంతులు వినిపించడానికి పోటీ చేస్తున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా చేసిన అరాచకంతో అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. నేరెళ్ల బాధితులం 8 ఏళ్లుగా పోరాటం చేస్తే, తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులకు ప్రమోషన్లు వస్తున్నాయని వారి తరఫున అభ్యర్థి ఆరోపించారు. సర్వస్వం కోల్పోయిన తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నేరెళ్లలో ఇసుక మాఫియా ఆగడాలపై తాము పెట్టిన కేసు ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదని, గతంలో అన్ని పార్టీలు హామీ ఇచ్చిన కనీసం ఇప్పటివరకు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలని జనంలోకి వెళ్లి జనాన్నే అడుగుతామని నిర్ణయించామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఉంటున్నామని స్పష్టం చేశారు. దీంతో..అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వారిని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com