TS : మిట్టపల్లి ట్విస్ట్.. అందెశ్రీకి పోటీగా కొత్త పాట

TS : మిట్టపల్లి ట్విస్ట్.. అందెశ్రీకి పోటీగా కొత్త పాట
X

తెలంగాణ గీతంపై అందెశ్రీ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమౌతున్నాయి. అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ టీమ్ రంగంలోకి దిగింది. జయజయహే తెలంగాణకు ధీటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తున్నామంటున్నారు మిట్టపల్లి టీమ్.

తెలంగాణ మట్టి వాసన గుర్తొచ్చేలా సాంగ్ ఉంటుందంటున్నారు మిట్టపల్లి సురేందర్ టీమ్ సభ్యులు. తెలంగాణ జనాన్ని ఆకట్టుకునేలా పాటలు రాయడంలో, ట్యూన్ చేయడంలో మిట్టపల్లికి మంచి పేరుంది. ఓ ప్రముఖ తెలంగాణ న్యూస్ ఛానల్ కు పాటలు రాసి ఆ ఛానల్ పాపులారిటీలోనూ మిట్టపల్లి కీలక పాత్ర పోషించారు.

అందెశ్రీ పాట, మిట్టపల్లి పాట ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story