Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం

Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
X

మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి – జమాండ్లపల్లి గ్రామాల మధ్య రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన రామ్ చరణ్, అరుణ్ అనే ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు బైకుపై మహబూబాబాద్ కళాశాలకు వెళ్తున్నారు. మహబూబాబాద్ వైపు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి బైకు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.

Tags

Next Story