TS : మూడు జిల్లాల్లో 2 రోజులు వైన్స్ బంద్

తెలంగాణలో ఈనెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.
దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com