Ujjaini Mahankali Bonalu : జులై 21 నుంచి ఉజ్జయినీ మహంకాళి బోనాలు

Ujjaini Mahankali Bonalu : జులై 21 నుంచి ఉజ్జయినీ మహంకాళి బోనాలు
X

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్స వాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టా లని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం లో ఆషాఢ మాసం బోనాల జాతర పై ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగ కుండా సరైన సౌకర్యాలు చేపట్టాలన్నారు.

జూలై 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవా లు జరుగుతాయన్నారు. 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్, మంత్రులకు మాత్రమే ప్రొటోకాల్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధి కారులు పాల్గొన్నారు.

Tags

Next Story