TS : మోదీ పాలనలో దేశం సత్యనాశ్: కేసీఆర్

TS : మోదీ పాలనలో దేశం సత్యనాశ్: కేసీఆర్

ప్రధాని మోదీ చెప్పిన నినాదాలు ఒక్కటైనా నిజమయ్యాయా అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ‘మోదీ పాలనతో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కాలేదు గానీ దేశం సత్యనాశ్ అయిపోయింది. మోదీ రాజ్యంలో బేటీ పడావో లేదు గానీ మహిళలపై అత్యాచారాలు ఉన్నాయి. అచ్చే దిన్ బదులుగా సచ్చే దిన్ వచ్చాయి. ఇంధన ధరలు పెరిగాయి’ అని విమర్శలు చేశారు.

ప్రధాని మోదీ తనను అరెస్టు చేయించాలని కుట్ర పన్నారని కేసీఆర్ అన్నారు. ‘దేశంలో నేను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ మోదీకి లొంగలేదు. దీంతో మమ్మల్ని జైల్లో పెట్టడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. నేనెక్కడా అవినీతి చేయలేదు కాబట్టి దొరకలేదు’ అని స్పష్టం చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని, ప్రాంతీయ పార్టీల కూటమే అధికారం చేజిక్కించుకుంటుందని కేసీఆర్ ఓ ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు.

ఇక తన చిన్ననాటి గురువు రమణయ్య ఆశీస్సులు తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మంచానికే పరిమితమైన గురువు రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి జగిత్యాలలో బస చేసిన కేసీఆర్, సోమవారం నిజామాబాద్ కు బయలుదేరే ముందు తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story