DSC Candidate : పోలీస్ కాళ్లుమొక్కిన నిరుద్యోగి..

డీఎస్పీ రాత పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి డీఎస్సీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో భారీ సంఖ్యలో డీఎస్సీ అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వండంటూ ఆ అభ్యర్థి పోలీసు ఆఫీసర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు. మేం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం.. ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు.. మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ గవర్నమెంటే బెటర్ అంటూ అతను తెలిపాడు.
ఇక డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద చేరుకున్న ప్రతి అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యగా యువత డిమాండ్ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com