TG : రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ గా వద్దిరాజు రవిచంద్ర

రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ( Vaddiraju Ravichandra ) బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియమించారు. పార్టీ విప్ గా ఎంపీ దీవకొండ దామోదర్ రావునకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కి కేసీఆర్ లేఖ రాశారు.
ఇటీవల బీఆర్ఎస్ అధినేత రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్షనేతగా ఉన్న కె. కేశవరావు స్థానంలో సురేశ్ రెడ్డిని నియమించారు. కేకే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆయన స్థానంలో సురేశ్ రెడ్డిని పార్టీ పక్షనేతగా ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్ కు లేఖ రాశారు.
ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజును నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com