TS : నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు

TS : నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు తుది తీర్పు వెలువడనుంది. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని గతంలో ఆమె పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్‌ కోసం మరోసారి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై చివరిసారిగా ఈ నెల 22న రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని, కవిత మహిళ కాబట్టి పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫున న్యాయవాది విక్రమ్‌ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు . ఇక మనీలాండరింగ్‌ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 6న తీర్పు రానుంది. ఆమె జ్యుడీషియల్‌ కస్టడీ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది.

Tags

Read MoreRead Less
Next Story