TS : కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పు ఇవ్వనున్నారు. కవిత బెయిల్‌పై గత నెల 22న కోర్టులో వాదనలు జరగ్గా.. ఈ నెల 2కు తీర్పు రిజర్వ్ చేశారు. కానీ పలు కారణాలతో ఆరోజు కూడా తీర్పు వాయిదా పడింది.
కాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడి, సీబీఐ కేసులో కవిత బెయిల్ కోసం గత నెల 22న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే 2కు తీర్వు రిజర్వు చేశారు. అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా.. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు మే 6కు రిజర్వ్ అయ్యింది.
ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడీషయల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. బెయిల్‌ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం.. కవితను కోర్టులో హాజరుపరుస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com