TS : భట్టి విక్రమార్కపై వీహెచ్ ఫైర్

ఖమ్మం టికెట్ తేలేవరకు తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ నిరసన ఆగేట్టు లేదు. మాజీ ఎంపీ అయిన వీ హనుమంతరావు మరోసారి నిరసనకు దిగారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని తన ఇంట్లో మౌన దీక్షకు దిగనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం వీహెచ్ మీడియాతో మాట్లాడారు.
భట్టిని తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత ఆయనకు సీరియస్ అయ్యారు వీహెచ్. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై కక్ష గట్టారని ఆవేదన చెందారు. ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని తెలిపారు. తనకు టికెట్ రాకుండా కుట్రలు చేయడమే కాదు.. ఖమ్మం టికెట్‌ను బయటవారిని ఇవ్వడానికి సిద్ధమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు.
తన ఆవేదనపై, తనపై కుట్రల మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు భట్టి. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీహెచ్. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com