TS : పోలింగ్ బహిష్కరించిన గ్రామాలు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో తమ ఓటు హక్కు విని యోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం పోలింగ్ను బహిష్కరించారు.
తమ గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదంటూ.. ఆ యా గ్రామాల ప్రజలు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. నాగర్ కర్నూలు మండలంలోని బల్మూర్ లో మైనింగ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలింగ్ను బహిష్కరించినట్లు వారు తెలిపారు.
ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలం రాయమాచారంలో గ్రామస్తులు పోలింగ్ ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. పోలింగ్ బహిష్కరించినట్లు చారు పేర్కొన్నారు. యాద్రాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని కనుము క్కల గ్రామస్తులు ఈ ఎన్నికలను బహిష్కరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయిందని వారు అవేదన వ్యక్తం చేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేసినా.. వారు పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తే.. ఓటు వేసేందుకు తామంతా సిద్ధమని కనుముక్కలు గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు. నిర్మల్ జిల్లాలోని కడెం మండలం లోని అల్లంపల్లి గ్రామస్తులు కూడా పోలింగ్ కుదూరంగా ఉన్నారు. తమ గ్రామంలో రహచారి సమస్య ఉందని.. దీనిని చాలా కాలంగా ప్రభుత్వం పరిష్కరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com