AP and TG : నిధులన్నీ ఏపీకేనా.. మరి తెలంగాణకేవి? : వినోద్ కుమార్
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలో ఉందని, దాని ప్రకారం రాష్ట్రానికి వాటికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఇస్తే సంతోషమేనని, తెలంగాణకు కూడా ఇవ్వాలన్నారు. కేంద్రంలో సీఎం చంద్రబాబుపై మోదీ ఆధారపడ్డారు కాబట్టి.. ఏపీకి నిధులు ఇస్తారా? అని ప్రశ్నించారు. కాజీపేటకు ర్వేల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపడం పట్ల రాష్ట్ర బీజేపీ నేతలు నోరు విప్పాలని వినోద్ కుమార్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com