TG : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం

TG : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం

వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వైదేహీనగర్ శివసింధు స్కూల్ ముందు గత నాలుగేండ్లుగా సాయి తేజ ఫుట్ వేర్ దుకాణాన్ని పుష్ప అనే మహిళ నిరహిస్తుంది.ఆ ఇంటి యజమాని దుకాణాన్ని ఖాళీ చేయాలని వెంటపడుతుండడంతో ఆగస్టు వరకు సమయం ఇవ్వాలని పెద్ద మనుషుల ముందు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. తిరిగి గత నెలరోజులుగా మళ్ళీ వేధించటం మొదలు పెట్టారు.వారం రోజుల కింద కూడా వారిపై దాడి యత్నించారు. పుష్ప తన కుటుంబ సభ్యులతో కలిసి వనస్థలిపురం పొలిస్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకొని పట్టించుకోలేదని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం పలువురు రౌడీలను పెట్టించి దౌర్జంగా దుకాణంలో ప్రవేశించి వారిపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు దుకాణంలోని చెప్పులను బయట పడేసి వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కోవడంతో పాటు నగదును తస్కరించినటు బాధితులు పేర్కొంటున్నారు. భాదితులకూ సహకరించకుండా పోలీసులు దాడికి పాల్పడుతున్న వారికి సహరించి తిరిగి బాధితులపైన దాడి చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనలో పుష్ప కుటుంబ సభ్యులు ఐదుగురు గాయపడ్డట్లు బాధితులు తెలిపారు.

Tags

Next Story