TS : వివేక్ నీ బట్టలూడదీసి కొడతా.. బీజేపీ ఆభ్యర్థి గొమాసె హెచ్చరిక

TS : వివేక్ నీ బట్టలూడదీసి కొడతా.. బీజేపీ ఆభ్యర్థి గొమాసె హెచ్చరిక
X

కొద్దిరోజులుగా పెద్దపల్లి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పొలిటికల్ లీకులతో బీజేపీ కేడర్ గందరగోళంలో పడింది. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ నిప్పులు చెరిగారు.

'చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి కుటుంబం ముప్పై ఏండ్లుగా పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నది. వారిది స్థానికేతరుల కుటుంబం. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని అవాకులు, చెవాకులు పేలుతున్నది. ఇలాంటి విధానాలను మానుకోలేకపోతే వివేక్‌ వెంకటస్వామి బట్టలూడదీసి కొడతా' అంటూ పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గొమాసె శ్రీనివాస్‌ తీవ్రంగా హెచ్చరించారు. గురువారం ఆయన పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

అనంతరం సిర్పూర్‌కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి మాట్లాడారు.

Tags

Next Story