తెలంగాణలో వాటర్ వార్.. పెరుగుతున్న వాదనలు..

తెలంగాణలో ప్రస్తుతం నీటి వివాదం నటుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత మొన్న తెలంగాణ భవన్ కు వచ్చి నీటి వాటాలపై మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదిలో తెలంగాణ నీటి వాటాలకు అన్యాయం జరుగుతోందని.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల, నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు నీళ్లు తగ్గిపోతాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొంతెత్తకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందని చెప్పారు. అప్పటి నుంచి ఈ వివాదం తారా స్థాయికి చేరుకుంది. దీంతో అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ చేసింది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి వాటాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలోనే నీటి వాటాలపై ఏపీకి అనుకూలంగా వ్యవహరించారిన విమర్శలు గుప్పించారు.
ఇదే విషయం మీద నేడు అసెంబ్లీలో గట్టిగానే వాదనలు జరగబోతున్నాయి. మొత్తంగా కేసీఆర్ ఒక మాట అనేసరికి అది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చలు మొత్తం పక్కకు పోయి నీటి వాటాల విషయమే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో అనేక విషయాలను వెల్లడించారు. కేసీఆర్ రూ.27వేల కోట్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చుపెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. బీఆర్ ఎస్ తమ హయాంలో 90 శాతం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం ఖర్చుపెట్టామని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు.
ఆ ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లకు పైగా అవుతాయని.. కానీ బీఆర్ ఎస్ ఖర్చుపెట్టింది కేవలం రూ.27వేల కోట్లు మాత్రమే అన్నారు. ఇలా కేసీఆర్, బీఆర్ ఎస్ నేతలు ఏది పడితే అది చెబుతూ మళ్లీ సెంటిమెంట్ రాజేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీ, చంద్రబాబు పేర్లు లేకుండా కేసీఆర్ రాజకీయం చేయలేరని.. ఇంకా సెంటిమెంట్ రగిల్చి రాజకీయ లబ్ది చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. మొత్తానికి ఇలా నీటి పంపకాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టు సాగుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

