TS : సెటిల్ చేశాం.. ట్యాప్ చేశాం.. : భుజంగరావు సంచలనం

TS : సెటిల్ చేశాం.. ట్యాప్ చేశాం.. : భుజంగరావు సంచలనం
X

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశామనీ.. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ట్యాప్ చేశామని భుజంగరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి ఫోన్లు రికార్డ్ చేశామని ఒప్పుకున్నట్టు సమాచారం. లీడర్లు సహా విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ సహకరించిందని భుజంగరావు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతల సూచనతో.. కంపెనీలు, వీఐపీలు, వ్యాపార వేత్తల వివాదాలను సెటిల్ చేశామనీ.. టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్టుగా ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story