TS : దానంపై అనర్హత కోసం సుప్రీంకు కూడా వెళ్తాం : కేటీఆర్

TS : దానంపై అనర్హత కోసం సుప్రీంకు కూడా వెళ్తాం  :  కేటీఆర్

బీఆర్ఎస్ (BRS) పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై (Danam Nagender) అనర్హత వే టు వేయాలని కేటీఆర్ (KTR) అన్నారు. గెలిపించిన ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. మూడు నెలల్లోనే ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపించి, దానం నిర్ణయాన్ని తప్పని నిరూపిస్తారని వెల్లడించారు.

దానం నాగేందర్ పై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని... ఫిర్యాదుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసు కోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావడం, ఉండటం ముఖ్యం కాదని... పార్టీ కష్టకాలంలో ఉ న్నప్పుడు అండగా ఉండే నాయకుడే నిజమైన లీడర్లు అన్నారు. ఓటు వేసిన కార్యకర్తలను దానం వెన్ను పోటు పొడిచారని, పార్టీ మారి తప్పు చేశారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story