TS : నికార్సైన నాయకత్వం తయారుచేస్తాం.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

TS : నికార్సైన నాయకత్వం తయారుచేస్తాం..  కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

బీఆర్ఎస్ (BRS) పార్టీని వదిలి కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్..! ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్..!! ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు.!

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.! నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం .! కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మరోవైపు కేటీఆర్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story