Minister Seethakka : బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి సీతక్క

ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు మీద పడి ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం సంజీవరాయ నిగుట్ట వద్ద రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన మట్టిని పక్కనే ఉన్న గుట్ట వద్ద కూలీలు తవ్వుతుం డగా ప్రమాదం సంభవించింది. మట్టి తీస్తుండగా గుట్ట పైన ఉన్న బండరాళ్లు ఒక్కసారిగా కిందికి జారి కూలీల మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో ఈజీఎస్ కూలీ కందారపు సరోజన (52), ఆమె కూతురు మమత (32) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హమీ పనులు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెంద డం ప ట్ల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఘటన వార్త తెలిసిన వెంటనే జిల్లా డీఆర్డీఓను ఘటస స్థలానికి పంపించారు. జరిగిన ప్రమాదం పై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడిన వివ రాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగే అవ కాశం ఉన్న ప్రాంతాల్లో ఉపాధి ప నులు చేయొద్దని జిల్లా అధికారులకు వారం రోజుల క్రితమే హెచ్చరించినా...పనులు కొనసాగడం పట్ల సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాల ని సూచించారు. మరణించిన, గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీత క్క హమీ ఇచ్చారు. బాధిత కుటుంబాల కు అవ స ర మైన అన్ని ఏర్పాట్లు చేయాల ని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ను ఫోన్లో ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com