Wedding Tragedy : పెళ్లింట విషాదం .. తండ్రి మృతి..

Wedding Tragedy : పెళ్లింట విషాదం .. తండ్రి మృతి..
X

కూతురు పెండ్లి కనులపండువ గా చేశారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన ఘటన శంషాబాద్ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కూకట్ పల్లికి చెందిన పెద్ద రాజుల రామచంద్రయ్య, అతని కొడుకు భాస్కర్, బంధువులు పద్మ, అలవేలు తో కలిసి తన కారులో కూతురు పెండ్లి వనప ర్తి జిల్లా గోపాలపేట గ్రామంలో ఉండడంతో ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. పెండ్లి తర్వాత తిరుగు ప్రయాణంలో కూకట్ పల్లికి వస్తుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ నేషనల్ హైవే వద్ద ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న పెద్దరాజుల రామచంద్రయ్య (55) అక్కడికక్కడే మృతి చెందగా.. అతని కొడుకు భాస్కర్ తో పాటు పద్మ, అలవేలుకు తీవ్ర గాయాలు కావడంతో శంషాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేస్తున్నారు.

Tags

Next Story