KCR : 15 ఏళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్

KCR : 15 ఏళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్
X

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 15 ఏళ్లపాటు పవర్‌లో కొనసాగుతామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ( KCR ) ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో పార్టీ ZP ఛైర్‌పర్సన్స్‌తో ఆయన మాట్లాడారు. ‘మనం అధికారంలోకి వచ్చాక YSR పథకాలైన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పేర్లు మార్చకుండా కొనసాగించాం. కానీ నేడు కొందరు కేసీఆర్ జాడల్నే తుడిచేయాలనుకుంటున్నారు. అంటే తెలంగాణనే తొలగిస్తారా?’ అని ప్రశ్నించారు.

పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తున్నదని అన్నారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు

వచ్చే ఎన్నికల్లో తాము బీ-ఫామ్ ఇచ్చిన ప్రతి నేత గెలుస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ‘పవర్‌లో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన నాయకులు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గాల సంఖ్య 160కు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. వీలైనంత త్వరలో పార్టీలో అన్ని స్థాయుల్లో కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తాం. సోషల్ మీడియాలోనూ మరింత విస్తరిస్తాం’ అని స్పష్టం చేశారు.

Tags

Next Story