TG : బీఆర్ఎస్ కు ఆ ఓట్లు ఏమైనట్టు?

TG : బీఆర్ఎస్  కు ఆ ఓట్లు ఏమైనట్టు?

లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ రాకపోవడంపై బీఆర్ఎస్ ( BRS ) సమాలోచనల్లో పడింది. కేసీఆర్ ( KCR ) బస్సు యాత్రకు తండోపతండాలుగా జనం వచ్చారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలోకి బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడ జరిగిందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టొద్దంటూ అధినేతకు అనుచరులు సూచిస్తున్నారట. దీంతో ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో డిపాజిట్లు దక్కలేదు. 17 సీట్లలో ఒక్క చోట కూడా గెలవకపోవడంతో గులాబీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ‘డకౌట్’తో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Tags

Next Story