TS : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అయ్యేది ఎవరు..?

TS : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అయ్యేది ఎవరు..?

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం కొనసాగుతోంది. కోదండరాం, జర్నలిస్టు అమెర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమించాలని నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ ఆమోదముద్ర కోసం గతంలోనే పంపించారు. గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారు. కానీ హైకోర్టు ఇందుకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి గతంలో నిర్ణయించిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

తీర్పు వెలువరించే విషయంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. “వాళ్ల అర్హతలకు సంబంధించిన వివరాలు కావాలంటే క్యాబినెట్ నుంచి తెప్పించుకుంటాం. వారి నియామకాన్ని పున: పరిశీలిస్తాం” అని వ్యాఖ్యానించింది. నిబంధన ప్రకారం అది కచ్చితంగా జరగాలి. అందువల్లే హైకోర్టు కోదండరాం, అలీ ఖాన్ నియామకానికి సంబంధించిన జీవోను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు వరకే పరిమితమైంది. గవర్నర్ విచక్షణాధికార పరిధిలోకి ప్రవేశించలేదు. ఇదే ఇప్పుడు అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న.

ఇక్కడే మళ్ళీ మరొక విధానం ప్రారంభమవుతుంది. గవర్నర్ క్యాబినెట్ నుంచి వివరాలు అడుగుతుంది. గత క్యాబినెట్ ప్రస్తుతం లేదు కాబట్టి.. కోదండరాం, అలీ ఖాన్ నియామకాన్ని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి.. ప్రస్తుత క్యాబినెట్ ఆ వివరాలు గవర్నర్ కు అందిస్తుంది. ప్రస్తుతం గవర్నర్ కు, ప్రభుత్వానికి ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి కోదండరాం, అలీ ఖాన్ నియామకానికి ఆమోదముద్ర వేస్తుంది. వాస్తవానికి హైకోర్టు చెప్పినట్టు అభ్యర్థుల అర్హతల మీద ఏమైనా సందేహాలు ఉంటే క్యాబినెట్ అభిప్రాయాలు కచ్చితంగా తెప్పించుకోవాలి. సో ఇప్పుడు జరిగేది అదే కాబట్టి.. పెద్ద ఇబ్బంది లేదు. ఒకవేళ వారు గవర్నర్ కోటాలో నియమితులై ఉంటే.. వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారి ఉండాలి. ఈ జాబితాలో రాజకీయ నాయకులపై నిషేధం వంటి నిబంధన లేదు. సాధారణంగా ఇలాంటి వాటిని అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని, సంబంధిత దస్త్రాన్ని గవర్నర్ కు పంపిస్తుంది. గవర్నర్ కూడా దానికి ఆమోదం ముద్ర వేస్తారు. సో మొత్తానికి కోదండరాం, అలీ ఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అవుతున్నారు. ఎమ్మెల్సీలయిన మరుసటి క్షణమే కోదండరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారట.. రేవంత్ రెడ్డి మదిలో కూడా అదే ఆలోచన ఉందట. చూడాలి... కేసీఆర్,కోదండరాం ఒకేసారి చట్టసభల్లో ఉండటం కూడా ఆసక్తికరమైన అంశం.

Tags

Read MoreRead Less
Next Story