TS : వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ టికెట్ దక్కేదెవరికి?

వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీకి దీటుగా బలమైన అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పోటీ నుంచి తప్పుకోవడం, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనుండడంతో కొత్త అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్ అధిష్ఠానం అన్వేషిస్తోంది.
ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లా మడికొండలో ఆదివారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కేడర్‌లో అయోమయాన్ని తొలగించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగనున్నారు. అయితే, ఈ సమావేశంలోగానే వరంగల్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
కాగా, టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య పెద్ది స్వప్న, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, జోరిక రమేశ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు... ఇటీవలే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తాటికొండ రాజయ్య తిరిగి గులాబీ గూటికి చేరుతారని, టికెట్ ఆయనకే ఇస్తారనిప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com