TS : వలసల్ని కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ఆపలేకపోతున్నారు..?

TS : వలసల్ని కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ఆపలేకపోతున్నారు..?

Telangana : తెలంగాణలో కేసీఆర్ (KCR), కేటీఆర్ కు (KTR) పాపులారిటీ మామూలుగా ఉండదు. తండ్రీ కొడుకులైనప్పటికీ వారి దూకుడు వల్లే పార్టీకి సారథి, ఉపసారథి అయ్యేంత స్థాయికి చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఊపు అందుకున్న తర్వాత టీఆర్ఎస్‌లో చేరికలకు అంతే లేదు. తెలంగాణ భవన్ కిటకిటలాడేది. ఆ పరిస్థితి బీఆర్ఎస్‌గా పేరు మార్చుకునే వరకూ సాగింది. ఇప్పుడు అలా చేసిన వారంతా కట్టలు తెగినట్లుగా బయటకు పారిపోతున్నారు.

బీఆర్ఎస్‌లో మొత్తం పోయే కాలమే కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ మాత్రం క్రేజ్ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడునెలల్లోనే బీఆర్ఎస్ పేరును మరింత చెడగొట్టడంలో సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వేరే పార్టీలో చోటు దొరికితే చాలనుకుంటున్నారు. దిగువస్థాయి క్యాడర్ నుంచి మంత్రులుగా పని చేసిన వారి వరకూ అదే పరిస్థితి.

పక్క పార్టీలకు వెళ్లిపోతున్న నేతలను బుజ్జగించడానికి, ఆపడానికి కూడా కేసీఆర్, కేటీఆర్ కు శక్తి చాలడం లేదు. తాము చెప్పినా వినే పరిస్థితిలేదని… బుజ్జగించే ప్రయత్నం చేసి తమ విలువను తగ్గించుకోవడం ఎందుుకన్నట్లుగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారు. లీడర్లు పోయినా క్యాడర్ ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల లోగా పార్టీ వలసలను కేసీఆర్, కేటీఆర్ ఎంతవరకు కంట్రోల్ చేస్తారన్నదానిపై ఆ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story