Hyderabad Metro : వావ్.. హైదరాబాద్ మెట్రో మరో రికార్డ్
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు చాలా కీలకం. హైదరాబాద్ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు.. ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది ఈ మెట్రో ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు.
హైదరాబాదీలు ప్రయాణం చేసినంత సేపు అయినా చల్లచల్లగా ఏసీలో వెళ్లొచ్చని భావిస్తున్నారు. రష్ పెరగడంతో హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని అందుకున్నది. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో 50 కోట్ల మందిని గమ్య స్థానాలకు చేర్చి చరిత్రను లిఖించింది.
దేశంలోనే మూడో అతిపొడవైన మెట్రో వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో గుర్తింపు పొందింది. మియాపూర్-అమీర్‌పేట మార్గంలో 11 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. అప్పటి నుంచి దశల వారీగా సర్వీసులను పెంచుతూనే ఉన్నారు. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయ్‌దుర్గ్ మార్గాల్లో దాదాపు 68 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నిత్యం హైదరాబాద్ మెట్రోలో 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com