Blood Donation : 62 సార్లు రక్తదానం చేసిన యువకుడు
రక్తదానం చేసేవాళ్లను ప్రాణదాతలు అంటుంటారు. ఈ దానం ఒక ప్రాణాన్నే కాదు కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రమాదకర పరిస్థితుల్లో అత్యంత అరుదైన ఓ నెగటివ్ గ్రూప్ రక్తాన్ని దానం చేస్తూ ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్నాడు ఓ యువకుడు.
తాను 62 సార్లు రక్తదానం చేశానని కరీంనగర్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. గంగాధర మండలానికి చెందిన ఓ మహిళకు డెలివరీ సమయంలో రక్తస్రావం కావడంతో.. మరోసారి రక్తదానానికి ఆయన ముందుకొచ్చారు. రక్తదానం కావాలని సమాచారం అందడంతో.. మహేందర్ రెడ్డి కరీంనగర్ బ్లడ్ బ్యాంక్ లో ఓ నెగటివ్ గ్రూప్ రక్తాన్ని దానం చేశారు.
ఈ రక్తదానంతో ఇప్పటివరకు ఓ నెగటివ్ రక్తాన్ని 62 సార్లు దానం చేశానని.. ఎదుటివారికి సాయపడటాన్ని అదృష్టంగా భావిస్తున్నాని చెప్పాడు బేతి మహేందర్ రెడ్డి. కరీంనగర్ బార్ అసోసి యేషన్ న్యాయవాదులు, డివిజన్ ప్రముఖులు ఆయన్ను అభినందించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com