Youtuber Praneeth : ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్

Youtuber Praneeth : ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్

తండ్రీ కూతురి రిలేషన్ పై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రణీత్‌పై 67బీ ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్ ,79, 294 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెంగళూరులో అరెస్టు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ2గా డల్లాస్‌ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్‌, ఏ4గా సాయి ఆదినారాయణను చేర్చారు. ప్రణీత్ తో పాటు ఈ ముగ్గురిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

Tags

Next Story