హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ‘సలార్‘

హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ‘సలార్‘
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ను మరోసారి ఊరమాస్ యాక్షన్ స్టార్ గా చూపించబోతున్న చిత్రం ‘సలార్‘.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ను మరోసారి ఊరమాస్ యాక్షన్ స్టార్ గా చూపించబోతున్న చిత్రం ‘సలార్‘. పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళికి దీటైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ‘కె.జి.యఫ్‘ సిరీస్ కు మిన్నగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ‘సలార్‘ రెడీ అవుతోందట. ‘ఆదిపురుష్‘ విడుదలవ్వడంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా ‘సలార్‘పైనే ఉంది.

ఇటీవలే ‘ఆదిపురుష్‘గా ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రభాస్ ఈ పౌరాణిక చిత్రంతో మిశ్రమ ఫలితాన్ని పొందాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ దృష్ఠ్యా ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపు 350 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ‘ఆదిపురుష్‘ హవా తగ్గుతూ వస్తోంది. అలాగే ఈ మూవీలోని పాత్రల చిత్రీకరణ విషయంలోనూ డైలాగ్స్ విషయంలోనూ కాంట్రవర్శీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక ‘ఆదిపురుష్‘ను పక్కనపెడితే ఇప్పుడు ప్రభాస్ ఫోకస్ అంతా సెప్టెంబర్ లో రాబోతున్న ‘సలార్‘పైనే ఉంది.

‘కె.జి.యఫ్‘ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించి ఇండియా మొత్తంలో రాజమౌళికి దీటైన దర్శకుడుగా పేరు సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడు ప్రభాస్ తో చేస్తున్న సినిమా కావడంతో ‘సలార్‘పై అంచనాలు ఆకాశాన్నంటాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాని ‘కె.జి.యఫ్‘కి మించి అన్న రీతిలో తీర్చిదిద్దుతున్నాడట.

‘కె.జి.యఫ్‘ సిరీస్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలోనే ‘సలార్‘ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుంటే ప్రధాన ప్రతినాయకుడిగా మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ కనిపించబోతున్నాడు. ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, ఈశ్వరి రావు, శ్రీయ రెడ్డి నటిస్తున్నారు. రాఖీ భాయ్ యశ్ కూడా ఈ మూవీలో కేమియోలో కనిపించనున్నాడట. ఇక ‘కె.జి.యఫ్‘ సిరీస్ కు అద్భుతమైన సినిమాటోగ్రఫీ సమకూర్చిన భువన్ గౌడ సంగీతాన్నందించిన రవి బస్రూర్ లు ‘సలార్‘కి కూడా పనిచేస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 28న ‘సలార్‘ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో ‘సలార్‘ ప్రభంజనానికి కేవలం 100 రోజులు మాత్రమే అంటూ ఈ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది టీమ్. త్వరలోనే ‘సలార్‘ నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మొత్తంమీద ‘బాహుబలి‘ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ అసలుసిసలు యాక్షన్ ఎంటర్ టైనర్ ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story