Anupama Parameswaran : పులికి దగ్గరగా అనుపమ.. అంత ధైర్యం ఉంది కాబట్టే అలా..!

తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ప్రస్తుతం ఈ అమ్మడు.. తెలుగు తో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇక టాలీవుడ్‌లో అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తో టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల రిలీజైన ట్రైలర్లో బోల్డ్ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అనుపమ.. టూ మచ్ బోల్డ్ గా నటించింది. హద్దులు చెరిపేసి రెచ్చిపోయింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదేంటి అనుపమ.. నిన్న మొన్నటి వరకు అంత ట్రెడిషనల్ గా ఉన్న నువ్వు సడన్గా ఇంత బోల్డ్ గా మారిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసింది అనుపమ. ఈ వీడియోలో స్కై డ్రైవింగ్, స్కై రోప్ సైకిలింగ్, కార్ రేస్, వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడం, అడవిలో జంతువులను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడం.. ఇలాంటివి కనిపిస్తాయి. అలాగే బోట్లో డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపించింది. కాగా అడవిలో టైగర్ ని కూడా అనుపమ దగ్గర నుంచి చూస్తూ విడియోకి స్టిల్ ఇచ్చింది. అమాయకంగా కనిపించే అనుపమలో ఇంత ధైర్యం ఉందా.. అంత దగ్గర నుంచి పులిని చూస్తూ కూడా కాస్త కూడా భయం లేకుండా వీడియోకు స్మైల్ ఇస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
https://www.instagram.com/reel/C3xmvCIJRLK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com