Viral : నానో కారులో కోటీశ్వరుడు

Viral : నానో కారులో కోటీశ్వరుడు

ప్రముఖ వ్యాపారవేత్త, సంపన్నుడు 'రాజేష్ హీరానందని' రెడ్ కలర్ టాటా నానో కారులో వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో రాజేష్ హీరానందని.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ ప్రవేశ ద్వారా దగ్గర.. టాటా నానో కారును ఉంచి వాలెట్‌తో మాట్లాడారు. రిసీప్ట్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వేలకోట్ల సంపదకు అధినాయకుడైన రాజేష్ హీరానందని.. సాధారణ నానో కారులో రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రత్యేకంగా తయారు చేసుకున్న కస్టమ్ బిల్డ్ ఎలక్ట్రిక్ నానో కారును దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఉపయోగిస్తారు. రతన్ టాటా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ నానో కారును మార్కెట్లో లాంచ్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్కడక్కడా రోడ్ల మీద నానో కార్లు కనిపిస్తుంటాయి.

రాజేష్ హీరానందని ఈ కారుకు సంబంధించిన వీడియోతో ఈ కారు మరోసారి హాట్ టాపిక్ అయింది. తక్కువ ధరతో.. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారుపై చాలామంది దృష్టిపెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story