Super Gift : పెళ్లిలో వరుడికి పెండ్లికూతురు సూపర్ గిఫ్ట్

Super Gift : పెళ్లిలో వరుడికి పెండ్లికూతురు సూపర్ గిఫ్ట్

గర్ల్‌ఫ్రెండ్‌, బాయ్‌ఫ్రెండ్‌ మధ్య.. లేదా భార్య భర్తల మధ్య గిఫ్టులు సర్వసాధారణం. ఐతే.. పెళ్లి వేడుకలోనే వరుడికి వధువు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేరళలో ఈ సంఘటన జరిగింది. వరుడి కళ్లకు గంతలు కట్టి కుటుంబీకులు, స్నేహితులు బయటకు తీసుకువస్తారు. అతని బంధువులు, వధువు అక్కడ వేచి ఉంటారు. ఈ ఇంట్రెస్టింగ్‌ సంఘటనను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

బయటకు వచ్చాక వరుడి కళ్లకు గంతలు విప్పుతారు. అతని ఎదురుగా ఉన్న బైక్ పై ఎర్రటి గుడ్డ కప్పి ఉంటుంది. అది చూసి పెళ్లికొడుకు సంభ్రమాశ్చర్యానికి లోనవుతాడు. ఓ రకమైన ఎగ్జైట్ మెంట్ తో ఆ క్లాత్‌ను తీస్తాడు. అంతే.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్ ను చూసి.. ఎగిరి గంతేస్తాడు. సర్‌ప్రైజ్‌కు గురై సంతోషంతో తన భార్యకు హగ్ ఇస్తాడు. అదే జోష్ లో.. ఆ కొత్త దంపతులు.. కొత్త బైక్ హంటర్‌ 350 రైడ్‌కు వెళ్తారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ బైక్ అంటే .. హెవీ బాడీ ఉన్నవారికి ఓ పిచ్చి. యూత్ చాలా క్రేజీగా నడపాలనుకుంటారు. స్టైలిష్‌ లుక్ , ఫీచర్లు యూత్ కు బాగా నచ్చాయి. 349.34సీసీ ఇంజిన్ కావడంతో.. నడపడటంలో మంచి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందనేది యూత్, రైడస్స్ చెప్పే మాట.

Tags

Read MoreRead Less
Next Story