Metro : కూలీని మెట్రో ఎక్కనివ్వని ప్యాసింజర్లు.. నిజమెంతో తెలుసా?

Metro : కూలీని మెట్రో ఎక్కనివ్వని ప్యాసింజర్లు.. నిజమెంతో తెలుసా?

చినిగిపోయిన షర్ట్ వేసుకుని ఓ వ్యక్తి మెట్రో రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని మిగతా ప్యాసింజర్లు అడ్డుకున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. స్మార్ట్ సిటీ బెంగళూరులో జరిగింది.

అతడు ఓ కార్మికుడు. వేసుకున్న షర్ట్ కు పైన రెండు బటన్స్ లేవు. దీంతో.. మెట్రోలోపలికి కొందరు అతడిని రానివ్వలేదు. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అవుతోంది. దీనిపై చర్చ జరుగుతోంది.

బెంగళూరు నమ్మ మెట్రోలోని గ్రీన్ లైన్ లో ఉన్న దొడ్డకళ్లసంద్ర మెట్రో స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. సమాజంలో పేదలపై వివక్ష కొనసాగుతోందని, ఇకనైనా మారరా? చాలామంది నెటిజన్లు ప్రశ్నించారు. ఈ కథనం నిజమేనా అన్నది మరికొందరి డౌట్. ఆ ప్యాసింజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL), బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ను ట్యాగ్ చేశాడు. దీని కింద జరుగుతున్న చర్చలో అడ్డుకున్న వారికి మద్దతుగా ఆసక్తికరమైన రిప్లైలు కూడా కొందరు పెడుతున్నారు. కార్మికుడు మద్యం సేవించి ఉన్నాడని, అతడి వద్ద నుంచి మద్యం వాసన భరించలేనంతగా వచ్చిందని, అందువల్లనే అతడిని మెట్రో లోపలికి అనుమతించలేదని ఒకరిద్దరు అన్నారు. ఆ కార్మికుడు మద్యం తాగి ఉండడంతో, అధికారులు అతడిని పక్కకు తీసుకువెళ్లి ప్రశ్నించారని అధికారులు కూడా ఓ రిప్లై ఇచ్చారు. డ్రంకెన్ అనేది కూడా ప్రూవ్ అయిందని.. మెట్రోలో రూల్స్ పాటిస్తూ ఎవరైనా జర్నీ చేయొచ్చని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story