Flex Board : ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురికి చావు ఫ్లెక్సీ కట్టిన తండ్రి
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించాడు ఓ తండ్రి. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. బీవై నగర్ కు చెందిన చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష (18) బీ.టెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పక్క వీధిలో ఉండే అబ్బాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లకి చెప్పకుండా వెళ్ళిపోయి ప్రియుడ్ని వివాహం చేసుకుంది. దీంతో తన కూతురు చనిపోయిదంటూ ఇంటిముందు చావు ఫ్లెక్సీ కట్టి్ంచి శ్రద్ధాంజలి ఘటించాడు.
తమను కాదనుకుని వెళ్లిపోయిన కూతురు తలుచుకుని తండ్రి మురళి బోరున విలపించాడు. అమ్మలారా.. అయ్యలారా.. నా బిడ్డ వెళ్లిపోయింది. మంచి కాలేజీలో చదువుతోన్న అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు. ఇలా ఎవరూ బతకొద్దు. మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు. మీ కాళ్లు మొక్కుతా' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com