Andhra Pradesh : తల్లి బతికి ఉండగానే పెద్దకర్మ భోజనాలు

Andhra Pradesh : తల్లి బతికి ఉండగానే పెద్దకర్మ భోజనాలు
X

బతికి ఉండగానే పెద్దకర్మ భోజనాలు పెట్టాలని..ఊరంతా పిలిచి వేడుకగా చేసుకోవాలని తపించింది. తన కోరికను కొడుకుల ముందు ఉంచి.. బతికి ఉండగానే పెద్ద కర్మభోజనాలు పెట్టించింది ఓ తల్లి. కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో రంగమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఉంది. త్వరలోనే చావు ఖాయం అని డిసైడ్ అయిన ఆ రంగమ్మ.. ఇప్పటికే తన ఆస్తులు అన్నింటినీ కొడుకులకు రాసిచ్చేసింది. చేతిలో ఏమీ లేదు.. ఇలాంటి సమయంలో నేను చనిపోతే నా కొడుకులు ఏం చేస్తారు.. కనీసం నా పెద్ద కర్మ అయినా చేస్తారా.. భోజనాలు పెడతారా లేదా అనే డౌట్ వచ్చింది. నేటి సమాజంలోని సంఘటనలు చూస్తున్న రంగమ్మకు ఓ ఆలోచన వచ్చింది. కొడుకులను పిలిచి.. నా పెద్ద కర్మ భోజనాలు నేను బతికి ఉండగానే పెట్టాలని.. అందుకోసం ఊరు అందరినీ పిలవాలని సూచించింది. కొడుకులు, బంధువులు షాక్ అయ్యారు. ఆ తల్లి రంగమ్మ పట్టుబట్టి అనుకున్నది సాధించింది. ఊరు మొత్తానికి కబురు పెట్టారు రంగమ్మ కొడుకులు, బంధువులు, చుట్టాలకు సమాచారం ఇచ్చారు. తల్లి రంగమ్మ పెద్ద కర్మ భోజనాలు బతికి ఉండగానే ఏర్పాటు చేశారు.. ఇది మా తల్లి కోరిక అని చాటింపు వేశారు. పెద్ద కర్మ రోజు ఎలాంటి భోజనాలు పెడతారో.. అచ్చం అలాంటి భోజనాలు తయారు చేయింది.. ఆ తల్లి కళ్లెదుటే అందరికీ వడ్డించి పెట్టారు. ఈ కార్యక్రమం మొత్తం కళ్లారా చూసిన తల్లి రంగమ్మ హ్యాపీగా ఫీలయ్యింది. ఊరంతా ఇదేమి చోద్యం అంటూ నోరెళ్లబెట్టింది.

Tags

Next Story