iPhone : మీరెప్పుడైనా ఇలా చేశారా.. ఐఫోన్ పై గుడ్డును చూర్ణం చేసి..

సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్ (Viral Video) అవుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేదీ ఒకటి. ఆపిల్ ఐఫోన్‌పై (iPhone) గుడ్డును నలిపివేస్తున్న వీడియో ఇప్పుడు ఆన్‌లైన్ ను శాసిస్తోంది. అవును, మీరు చదివింది నిజమే. రీల్‌ను స్కాట్ హెంట్‌జెపీటర్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. అతను ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌పై అసాధారణమైన పని చేస్తున్నట్లు చూపించాడు.
స్కాట్ ఏమి చేసాడంటే.. ఐఫోన్ వెనుక వైపు గుడ్డును ఉంచి, నెమ్మదిగా దానిపై ట్రాన్స్ఫరెంట్ ఫోన్ కవర్‌ను ఉంచినట్లు చూపించింది. గుడ్డును చూర్ణం చేయడం కూడా ఇక్కడ చూడొచ్చు. కానీ ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో అప్‌లోడ్ చేసిన ఈ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 3.1 మిలియన్ల వ్యూస్ ను, వెయ్యి కామెంట్లను సేకరించింది. "నాకు నచ్చలేదు" అని కొందరు దనిపై అసహ్యం చూపించగా.. కోప, వికారం సూచించే ఎమోజీలను కూడా పంచుకున్నారు. మరో వీడియోలో అతను తన ఫోన్ కవర్, డెస్క్‌టాప్ స్క్రీన్‌కి డోరిటోస్, హగెల్స్‌లాగ్, ఫ్రెష్ కివీస్, స్ట్రాబెర్రీలను జోడించడానికి కూడా ప్రయత్నించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com