Robot : మహిళా రిపోర్టర్‌తో మగ రోబో అనుచిత ప్రవర్తన

Robot : మహిళా రిపోర్టర్‌తో మగ రోబో అనుచిత ప్రవర్తన

ఇది ఏఐ జమానా. రోబోటిక్ రోజులు. టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. రోబోలు మనుషులను ఆక్రమించేస్తున్నాయి. ఇప్పటికే వచ్చి ఏఐ సంచలనంగా మారింది. ఇక రోబోను ఎప్పట్నుంచే తయారు చేస్తున్నారు సైంటిస్టులు. మానవులను రీప్లేస్ చేసేలా హ్యూమనాయిడ్‌ రోబోలను తయారు చేస్తున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో కూడా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేశారు.

మగ మనిషి మొహమ్మద్ ఆకృతిలో ఉన్న రోబోను సౌదీ అరేబియోలో ఆవిష్కరించారు. ఫస్ట్ అప్పియరెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఓ ఫీమేల్ రిపోర్టర్ దానిపై రిపోర్ట్ చేస్తున్నారు. రోబో తన చేతితో ఆమెను వెనుకనుంచి పిరుదులపై తాకాడు. దీంతో.. ఆమె ఇబ్బంది పడ్డారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సౌదీ పురోతిని చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఒక జాతీయ ప్రాజెక్టుగా తొలి హ్యుమనాయిడ్‌ రోబోను రూపొందించారు. ఈ హ్యూమనాయిడ్‌ రోబోను రియాద్‌లో మార్చి 4వ తేదీన ఆవిష్కరించారు. రికార్డైన ఆ వీడియో మహిళా దినోత్సవం వేళ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. రోబో తప్పేలేదని కొందరు.. ఆమె కొంచెం దూరంగా ఉండాల్సిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story