Pakistan Chief Army : కశ్మీర్ తమదే అంటూ పాక్ ఆర్మీ చీఫ్ పిచ్చి కూతలు

కాశ్మీర్ మన కంఠసిర.. దానిని మరిచిపోవద్దంటూ ప్రవాస పాకిస్తానీయులను ఉద్దేశించి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'అది (కాశ్మీర్) మన కంఠసిర అనడంలో మన వైఖరి స్పష్టంగా ఉంది. దాన్ని మనం మరచిపోకూడదు. వీరోచితంగా పోరాడుతున్న మన కశ్మీరీ సోదరులను మనం విడిచిపెట్టకూడదు. మనకు, హిందువులకు మధ్య జీవితానికి సంబం ధించిన ప్రతీ విషయంలోనూ చాలా తేడాలు ఉన్నాయని మన తాతముత్తాతలు నమ్మారు. మన మతం, మన ఆచార వ్యవహారాలు, మన ఆలోచనలు, మన ఆకాంక్షలు పూర్తిగా (హిందువులతో పోలిస్తే) భిన్నమైనవి. పాకిస్తానీయు లందరూ ఒక అత్యున్నతమైన భావజాలానికి, సంస్కృతికి కట్టు బడి ఉన్నారు. దేశానికి పునాది లాంటి చరిత్రను తర్వాతి తరాలకు అందించండి" అని అన్నారు.
ఉగ్రవాదం, వేర్పాటు వాదం గురించి మాట్లాడుతూ, 13 లక్షల భారత సైన్యమే మనల్ని ఏమీ చేయలేక పోయింది. దేశ వ్యతిరేక శక్తుల్ని అణచివేస్తాం అని చెప్పారు. కాగా పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కాశ్మీర్ భారత్ కు చెందిన కేంద్రపాలిత ప్రాంతం. పరాయి భూమి కంఠసిర ఎలా అవుతుంది? దానికి పాకిస్తాన్తో ఉన్న ఏకైక సంబంధం ఆ దేశం ఆక్రమిత భూభాగాలను ఖాళీ చేయడంతో తీరిపోతుంది" అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com